ప్రతీ రాష్ట్రంలో ఫోరెన్సిక్‌ లాబోరేటరీ ఏర్పాటు


దేశంలోని ప్రతీ రాష్ట్ర రాజధానిలో ఫోరెన్సిక్‌ లాబోరేటరీని ఏర్పాటు చేయాల్సిందిగా పార్లమెంటరీ ప్యానెల్‌ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు సూచించింది. ఈ లాబోరేటరీలను రెండేళ్ల వ్యవధిలో ఏర్పాటు చేయాల్సిందిగా పేర్కొంది. నేర నిర్ధారణకు, నేరస్థుల గుర్తింపునకు, సాక్షాలకు ఒక బలమైన నెట్‌వర్క్‌గా ఈ ఫోరెన్సిక్‌ లాబోరేటరీలు పనిచేస్తాయంది. డా.సత్యనారాయణ్‌ జతియా నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఈ మేరకు తన నివేదికను నేడు పార్లమెంట్‌ ముందుంచింది. 


86.6 శాతం అత్యాచారం కేసులో కేవలం 32 శాతమే ప్రస్తుతం దోషులుగా తేలుతున్నారన్నారు. ఈ ఫోరెన్సిక్‌ లాబోరేటరీల ఏర్పాటు ద్వారా కేసులో బలమైన సాక్షాలను అతిత్వరగా ప్రవేశపెట్టవచ్చన్నారు. అదేవిధంగా దోషులకు శిక్షపడే శాతాన్ని పెంచొచ్చని పేర్కొన్నారు.